Speaker AyyannaPatradu Visited Zoopark in Tirupati: సభలో మాట్లాడేందుకు ప్రతి శాసనసభ్యునికి అవకాశం కల్పిస్తున్నామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ క్రమంలో ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. జూపార్క్‌లో మొక్కనాటిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పలు చోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సభకు రావాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ శాసనసభ్యులపై ఉందని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకీ హాజరై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చెయ్యి ఎత్తి కోరితే అవకాశం ఇస్తానన్నారు. తిరుపతి జంతు ప్రదర్శనశాల నిర్వహణకు ఏటా ఐదు కోట్ల రూపాయలు టీటీడీ కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
జగన్ ఆ అవకాశం కోరితే తప్పకుండా ఇస్తాను: స్పీకర్ అయ్యన్న
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 7:58 PM IST