Rape in Hyderabad : నేటి కాలంలో మహిళలపై అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు మరికొందరు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.
మద్యం మత్తులో స్నేహితురాలిని ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన స్నేహితులతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లారు. మద్యం మత్తులో ఆమె స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై సదరు మహిళ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.