ETV Bharat / snippets

సింగరేణి కార్మికులకు శుభవార్త- 2364 బదిలీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 7:26 PM IST

SINGARENI GOOD NEWS TO WORKERS
Singareni Regularize 2364 Badili Workers (ETV Bharat)

Singareni Regularize 2364 Badili Workers : సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్​లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా పర్సనల్ డైరెక్టర్​కు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వీరిని జనరల్ మజ్దూర్​లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.