Telangana Govt 2000 Crore Loans : రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో రూ.2000 సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. రూ.1000 కోట్ల విలువైన బాండ్లను 16 ఏళ్ల కాలానికి, మరో రూ.1000 విలువైన బాండ్లను 19 సంవత్సరాల కాలానికి జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను ఆర్‌బీఐ జూన్ నాలుగో తేదీన వేలం వేయనుంది. వేలంలో బాండ్ల విక్రయం తర్వాత రూ.2000 మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.8000 కోట్లను అప్పుగా తీసుకొంది. తాజాగా రూ.2000 కోట్లతో ఆ మొత్తం పది వేల కోట్ల రూపాయలకు చేరనుంది.
రుణాల ద్వారా రూ.2000 కోట్ల సమీకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం - ఆర్బీఐ ద్వారా బాండ్లు జారీ
Published : May 31, 2024, 9:50 PM IST