ETV Bharat / snippets

విద్యార్థులకు హెయిర్ కట్ ఘటన - టీచర్ సస్పెన్షన్ ఎత్తేయాలని పీఆర్టీయూ డిమాండ్

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 7:40 AM IST

PRTU Leader On Teacher Suspend
PRTU Leader On Teacher Suspend (PRTU Leader On Teacher Suspend)

PRTU Leader On Teacher Suspension : ఖమ్మం జిల్లాలో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే క్రమంలో వారి జుట్టును కత్తిరించిందని అంగ్ల ఉపాధ్యాయురాలిని సస్పెండ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరిగిన ఘటనపై రాష్ట్ర కమిటీ విచారణ నిర్వహించింది.

ఉపాధ్యాయులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం మాట్లాడుతూ విద్యార్థులను కమశిక్షణలో పెట్టడం ఉపాధ్యాయుల విధి అని ఉమాకర్ రెడ్డి అన్నారు. ఆ క్రమంలో ఉపాధ్యాయురాలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే జిల్లా డీఈవో కనీసం దర్యాప్తు చేయకుండా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. తక్షణమే ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్​ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.