ETV Bharat / snippets

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు - 22 మంది నుంచి రూ.46 లక్షల నగదు స్వాధీనం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 12:36 PM IST

TASK FORCE KALAPATTAR POLICE JOINT OPERATION
Police Raids on Poker Base in Hyderabad (ETV Bharat)

Police Raids on Poker Base: హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సారెడ్డి కాలనీలో పేకాట ఆడుతున్న ఇంటిపై దక్షిణ మండల టాస్క్​ఫోర్స్, కాలాపత్తర్​ పోలీసులు కలిసి దాడి చేశారు. అందులో భాగంగా 22 మంది పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.46 లక్షల 55 వేల నగదు, 8 సెల్ ఫోన్లు, 1 ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పేకాట అడ్డాను షేక్ మహమ్మద్ ఖదీర్ (38) అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు తెలిసింది. ఇతనికి సహాయకులుగా కొంత మంది వ్యక్తులు పని చేస్తున్నారు. మహ్మద్​ నయిం (35), షేక్ పాషా (35), మహ్మద్​ మజీద్ ​(29)లు పేకాట గ్రూప్​ నడిచేందుకు సహకరిస్తున్నారు. పట్టుబడిన నిందితులను కాలాపత్తర్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. తదుపరి చర్యల కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.