PCC Chief Sharmila Comments on CM Jagan: రాష్ట్రంలో మహిళల బ్రతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. నా అక్కలు, నా చెల్లెమ్మలంటూ మైక్‌ల ముందు సీఎం జగన్ ఫేక్ ప్రేమ నటిస్తూ మెుసలి కన్నీరు కారుస్తారని షర్మిల విమర్శించారు. జగన్ పాలనలో మహిళల భద్రతకు సంబంధించి సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. ఏపీలోని ఓ పాఠశాలలో 13 ఏళ్ల బాలికపై సీనియర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనను ఉద్దేశిస్తూ జగన్‌పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ వీధుల్లో విహరిస్తున్న సీఎం జగన్‌కు ఇక్కడి ఆర్తనాదాలు వినబడవని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఎందులో అత్యున్నత ర్యాంకులు రావాలో అందులో రావని ఆమె పేర్కొన్నారు.
మహిళలపై జగన్ ఫేక్ ప్రేమ నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తారు: షర్మిల
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 9:10 PM IST