Nagarjuna Sagar Crust Gates Closed : నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. నేటి ఉదయం వరకు 26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగిన తరుణంలో ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడం వల్ల క్రమంగా గేట్లను మూసివేస్తూ వచ్చారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి లక్ష 83 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో జలాశయం నుంచి కుడి కాల్వకు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 39 వేల 419 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాశయానికి గత వారం రోజులుగా వరద ప్రవాహం కొనసాగింది. మొత్తం జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.40 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 302.39 టీఎంసీలు గా ఉంది.