ETV Bharat / snippets

కోకాపేటలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Officials Demolish Illegal Structures
Officials Demolish Illegal Structures (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 4:31 PM IST

Officials Demolish Illegal Structures : హైదరాబాద్​లోని కోకాపేటలో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 147లో వెలసిన నిర్మాణాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. మరోవైపు నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమనిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. జీ ప్లస్ 2 కు అనుమతి తీసుకుని జీ ప్లస్ 5 నిర్మాణం చేపట్టడంతో ఆ భవానాన్ని కూల్చివేసినట్లు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. తాము అన్ని అనుమతులు తీసుకున్నాకే ఇంటి నిర్మాణం చేపట్టామని అయినా కూల్చివేశారని బాధితులు వాపోయారు. హైదరాబాద్ నగర శివారు నార్సింగి మున్సిపాలిటీలో గండిపేట మండల రెవెన్యూ అధికారులు, పురపాలక అధికారులు సంయుక్తంగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.