ETV Bharat / snippets

బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి - గుండెపోటుతో యువకుడి మృతి

Nizamabad Young Man Died in Dubai
Nizamabad Young Man Died in Dubai (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 3:16 PM IST

Nizamabad Young Man Died in Dubai : బతుకుదెరువు కోసం విదేశానికి వెళ్లిన యువకుడు అక్కడే గుండెపోటుతో మృతి చెందిన విషాదఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన సున్నం రమేశ్(30) అనే యువకుడు బతుకుదెరువు కోసం కొంతకాలం క్రితం దుబాయ్ వెళ్లారు. బాత్​రూంలో స్నానం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించినట్లుగా అతడి స్నేహితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు రమేశ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.