Mother and Daughter Died in Chittoor District : బిడ్డను రక్షించబోయే ప్రయత్నంలో తల్లి కూడా మృతి చెందిన ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చౌడేపల్లె మండలం కాటిపేరి గ్రామంలో కుమార్ రెడ్డి, మౌనిక దంపతులకు అనీశారెడ్డి (7) సంతానం. మౌనిక మదనపల్లెలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం సాయంత్రం స్టేషన్లో పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. తమ ఇంట్లో ఉన్న ఆవులకు నీళ్లు తాగించడానికి కుమారైతో పాటు సమీపంలోని పొలం వద్దకు వెళ్లారు. ఆమె కుమార్తె ఓ ఆవుకున్న తాడు పట్టుకోగా అది బెదిరి పాపను ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలోనే చిన్నారి సమీపంలోని కుంటలో మునిగిపోయింది. ఈ హఠాత్పరిణామంతో కంగారుపడిన మౌనిక తన కుమర్తెను కాపాడుకునేందుకు కుంటలో దూకారు. ఆమెకు ఈత రాకపోవడంతో ఇద్దరూ నీట మునిగి చనిపోయారు. ఆమె భర్త కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
బిడ్డను రక్షించబోయిన తల్లి - ఈత రాక కుంటలో పడి ఇద్దరూ మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 9:00 AM IST