ETV Bharat / snippets

గల్ఫ్‌ కార్మికులకు అండగా నిలవండి - సీఎం రేవంత్ రెడ్డికి జీవన్​ రెడ్డి లేఖ

MLC Jeevan Reddy letter to CM
MLC Jeevan Reddy letter to CM (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 12:25 PM IST

MLC Jeevan Reddy letter to CM : గల్ఫ్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు 15 లక్షల మంది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.పది వేలు స్వరాష్ట్రానికి పంపుతారనుకున్నా కూడా నెలకు రూ.1500 కోట్లు విదేశీ మారకద్రవ్యం రాష్ట్రానికి, దేశానికి వస్తుందన్నారు. అదే ఏడాదికి అయితే రూ.18000 కోట్లు విదేశీ మారకద్రవ్యం సమకూరుతుందని వివరించారు.

గల్ఫ్​లో ఉపాధి పొందుతూ మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షలు, అక్కడి నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన కార్మికులకు ఇక్కడి ప్రభుత్వం అందించే పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తన వినతులను పరిశీలించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. లేఖ కాపీలను ఉపముఖ్యమంత్రితో పాటు సీఎస్​కు పంపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.