ETV Bharat / snippets

ఉపాధి అవకాశములో యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి శ్రీధర్​ బాబు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 7:57 PM IST

MINISTER SRIDHAR BABU ON IT JOBS
Minister Sridhar Babu on IT Industries (ETV Bharat)

Minister Sridhar Babu on IT Industries : దేశంలో 7 రాష్ట్రాలలో కేన్స్ టెక్నాలజీ సంస్థ విస్తరించి ఉందని, ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయడం శుభసూచకమని మంత్రి శ్రీధర్​ బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్​లోని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ అయిన కేన్స్ తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఎలక్ట్రానిక్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం చాలా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు. ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి పనులు ప్రారంభించిందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.