Minister Seethakka On Women Safety : పని ప్రదేశంలో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క వెల్లడించారు. సీఐఐ ఇండియన్ వుమెన్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో నాయకత్వం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని సీతక్క కోరారు. ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు తోటి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. గ్రామీణ యువతకు తగిన ప్రోత్సాహం అందించినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమతుందని చెప్పారు. ప్రతి మహిళ తల్లి, సోదరి స్థానంలో ఉండి ఆలోచించి యువతకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సీతక్క కోరారు. ఉద్యోగ, ఉపాధి పనులకు వెళ్లే మహిళల రక్షణ కోసం ఇటీవల టీ సేఫ్ యాప్‌ను పోలీసు శాఖ తీసుకొచ్చిందని సీతక్క తెలిపారు.
వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి : మంత్రి సీతక్క
Published : Sep 20, 2024, 3:19 PM IST