Minister Konda Surekha fires on BJP : తాజా ఎన్నికల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. దేశంలో చార్ సౌ పార్ అంటూ 400 సీట్లు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన బీజేపీ నాయకులకు, ప్రజలు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు.
అంతకు ముందుగా ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆమె దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి రావడం తొలిసారి అని వ్యాఖ్యానించిన మంత్రి కొండా సురేఖ, మంత్రి పదవి అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండా సురేఖకు అర్చకులు శేష వస్త్రాలతో పాటు ప్రసాదాలను అందజేశారు.