ETV Bharat / snippets

తెలంగాణలో బంద్​కు పిలుపు​ ఇచ్చి దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు

Maoist Telangana Bandh
Maoist Calls For Telangana Bandh (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 1:30 PM IST

Updated : May 26, 2024, 1:48 PM IST

Maoists Call For Telangana Bandh : ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. బంద్​ పిలుపుతో మావోయిస్టులు అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ఛత్తీస్​గఢ్​​ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలోని చర్ల మండలం పూనుగుప్ప వద్ధిపేట మధ్యలో రొటీన్​ వాగు వద్ద చెట్లునరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

మరోవైపు వంతెన కింద మంటపెట్టడంతో భారీగా మంటలు వ్యాపించి వంతెనపై బీటలు బారాయి. ఇంకొన్ని చోట్ల విద్యుత్​ స్తంభాలు ధ్వంసం చేశారు. రోడ్డు మొత్తం విద్యుత్​ తీగలను తెంపి పడేశారు. బూటకపు ఎన్​కౌంటర్​లను నిరసిస్తూ బందుకు పిలుపునిచ్చినట్లు మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. బంద్​ను విజయవంతం చేయాలని పలు ప్రాంతాల్లో కరపత్రాలను వదిలి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.

Last Updated : May 26, 2024, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.