ETV Bharat / snippets

యాదాద్రి భువనగిరి జిల్లాలో సైబర్​ నేరగాళ్ల మోసం - క్రెడిట్​ కార్డు నుంచి రూ.88 వేలు స్వాహా

MAN LOSES MONEY FROM CREDIT CARD
Cyber Fraud By Credit Card (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 8:05 PM IST

Cyber Fraud By Credit Card : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​కు చెందిన స్థానిక ఎస్​బీఐ ఖాతాదారుడి క్రెడిట్​ కార్డు నుంచి సైబర్​ నేరగాళ్లు రూ.88 వేలు స్వాహా చేశారు. బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం 20 రోజులు క్రితం తన క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, సరి చేసుకోవాలని పదేపదే ఫోన్లు వచ్చాయి. ఈ వియషంపై బాధితుడు బ్యాంక్​కు వెళ్లగా క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఉద్యోగి సెలవులో ఉండటంతో వెనుతిరిగారు.

దీంతో చేసేదేమీ లేక ఫోన్​లో ఓటీపీ చెప్పారు. ఇంతలో కొత్త క్రెడిట్ కార్డు రాగా బాధితుడు దీని గురించి బ్యాంక్​కు వెళ్లి ఆరా తీశారు. క్రెడిట్ కార్డు నుంచి జులై 15న రూ.40 వేలు, అదే రోజు మరో రూ.48 వేలు ముంబయిలోని ఓ బ్యాంక్ ఖాతాకు జమైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాధితుడు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.