ETV Bharat / snippets

'కంట్రిబ్యూటర్ సలహాలను సైతం స్వీకరించే గొప్ప వ్యక్తి రామోజీరావు'

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 8:04 PM IST

Tribute to Ramoji Rao
Tribute to Ramoji Rao (ETV Bharat)

Tribute to Ramoji Rao: రామోజీరావు మార్గం ఆదర్శప్రాయం, అనితర సాధ్యమని మహబూబ్​నగర్ ఈనాడు యూనిట్ పరిధిలోని గ్రూపు సంస్థల ఉద్యోగులు కొనియాడారు. గురువారం మహబూబ్ నగర్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన రామోజీరావు శ్రద్ధాంజలి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఈనాడు, ఈటీవీ ఉద్యోగులు, కంట్రిబ్యూటర్లు, ఈనాడు ఏజెంట్లు ఇతర విభాగాల ఉద్యోగులు హాజరయ్యారు.

యూనిట్ మేనేజర్ శ్రీనివాస రావు ఛైర్మన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. క్రమశిక్షణ, సమయపాలన, నీతి,నిజాయితీ, నిరాడంబరతకు ఆయన నిలువుటద్దమని, ఆయన ఆచరించిన బాటలో అందరూ నడవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతానికి చెందిన కంట్రిబ్యూటర్ సలహా ఇచ్చినా స్వీకరించి, దాన్ని అమలు చేసే వారని అంతటి గొప్ప వ్యక్తిత్వం రామోజీకి మాత్రమే సొంతమన్నారు. ఆయన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేయడమే పెద్దాయనకు అందించే నిజమైన నివాళిగా అభివర్ణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.