Leopard migration in Adilabad: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచలాపూర్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అటవీశాఖ బిగించిన సీసీ కెమెరాల్లో చిరుత పులి దృశ్యాలు నమోదయ్యాయి. తలమడుగు పరిసర గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చిరుత దాడిచేసి ఓ పశువుతో పాటుగా, రెండు మేకలను చంపింది.
చిరుత దాడుల నేపథ్యంలో గ్రామస్థుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. రైతులు, కూలీలు పంటచేలకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరోవైపు అటవీ అధికారులు చిరుతకు ఎలాంటి హాని తలపెట్ట వద్దని కోరుతున్నారు. చిరుత ఎదురు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. చిరుత సంచారంతో వ్యవసాయ పనులు చేసుకోలేక పోతున్నామని, అధికారులు తమకు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.