KTR Fires on National Testing Agency : నీట్, నెట్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అసమర్థతపై లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. యూజీసీ నెట్ పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
నీట్ పరీక్షలో వైఫల్యాలను సమీక్షించి చర్యలు తీసుకోకముందే సమగ్రత విషయంలో రాజీ పడరాదని యూజీసీ నెట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. 11 లక్షలకు పైగా అభ్యర్థులు నెట్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ సంస్థ మరో పరీక్ష నీట్ విషయంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆయన వివరించారు. ఈ విషయంలో కేంద్రమంత్రి వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.