ETV Bharat / snippets

వక్ఫ్ సవరణల బిల్లుపై అభిప్రాయ సేకరణ -హైదరాబాద్​లో జేపీసీ భేటీ

JPC Meeting On Waqf Amendment Bill
JPC Meeting On Waqf Amendment Bill (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 1:50 PM IST

JPC Meeting On Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ నిమిత్తం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రంలో పర్యటన చేపట్టింది. హైదరాబాద్ తాజ్ కృష్ణలో జేపీసీ ఛైర్​పర్సన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. జేపీసీ కమిటీ ముందు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వినిపించారు. తెలంగాణలో తమ తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకువస్తూ సవరణ బిల్లుకు ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించి జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్​కు బీజేపీ ఎంపీలు వినతిపత్రాలు అందజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.