ETV Bharat / snippets

అమెరికాలోని హ్యూస్టన్​ నగరంలో భారతీయ వంటకాల రెస్టారెంట్​​

INDIAN CUISINE RESTAURANT
DESI RESTAURANT OPENING IN HOUSTON (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 11:26 AM IST

Indian Cuisine Restaurant : భారతీయ వంటకాల రుచులను అమెరికా వ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తున్న దేశీ డిస్ట్రిక్ట్ హ్యూస్టన్ నగరంలో భారీ స్థాయిలో నిర్మించిన రెస్టారెంట్ ప్రారంభమయ్యింది. ముఖ్య అతిథిగా హాజరైన భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్ రెస్టారెంట్​ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విస్తృతమైన ఆహార ఆఫర్లు, వినోద కార్యక్రమాలు, పిల్లల కోసం ప్రత్యేక ఆటలు, కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది ప్రవాస భారతీయులు, అమెరికన్లు హాజరై సందడి చేశారు. హ్యూస్టన్‌లోని 11129 వెస్ట్ హీమర్ రోడ్ వద్ద నూతనంగా ప్రారంభించిన ఈ శాఖ స్థానికులకు ప్రాచీన భారతీయ వంటకాల రుచులను అందిస్తోంది. దేశీ డిస్ట్రిక్ట్ ఇప్పటికే డల్లాస్‌లో 6 విజయవంతమైన శాఖలను నడుపుతూ, భారతీయ వంటకాలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా కొన్ని ప్రధాన నగరాలలో ఐదారు కొత్త శాఖలు త్వరలో ప్రారంభమవడానికి సిద్ధంగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.