Hyderabad Police Returned RS.50 Lakhs Cheque To FedEx Victim : ఫెడెక్స్ మోసానికి గురైన హైదరాబాద్‌కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడికి పోలీసులు డబ్బు తిరిగి అందించారు. స్కామ్‌లో పోగొట్టుకున్న రూ.50లక్షల 22వేల చెక్కును పోలీసులు బాధితుడికి ఇచ్చారు. ఇటీవల 5 పాస్‌పోర్ట్‌లు, 3 బ్యాంక్ కార్డులు, 140 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ సహా 4 కిలోల దుస్తులు, ల్యాప్‌టాప్ ఉన్న పార్సిల్ ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి బాధితుడికి కాల్ వచ్చింది. తర్వాత ముంబయి క్రైమ్ బ్రాంచ్ పేరిట వచ్చే కాల్కి కనెక్ట్ చేశారు. తాము అడిగినంత డబ్బివ్వకపోతే కేసు ఫైల్ చేస్తామని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని అతడిని భయపెట్టారు. దీంతో భయాందోళనకు గురైన వృద్ధుడు వారు అడిగినంత సొమ్మును బదిలీ చేశాడు. అనంతరం మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించి బుధవారం రోజున బాధితుడికి చెక్కును అందజేశారు.
ఫెడెక్స్ స్కామ్‌లో వృద్ధుడికి రూ.50లక్షలు టోకరా - కేసు ఛేదించి తిరిగి చెల్లించిన పోలీసులు
Published : Jun 13, 2024, 10:34 AM IST