ETV Bharat / snippets

కుటుంబ కలహాలతో ప్రేమ వివాహం చేసుకున్న జంట ఆత్మహత్య

Husband and Wife Suicide
Husband and wife Suicide In Nagarkurnool (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 4:41 PM IST

Husband and Wife Suicide In Nagarkurnool : నాగర్​కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంకు చెందిన ఓ యువ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం బల్మూర్ మండలం జినుకుంట గ్రామానికి చెందిన మహేష్, భానుమతి సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

రాత్రి మహేష్​కు అతని తండ్రికి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ ఉదయం తెల్లవారుజామున బైక్​పై ఇంటి నుంచి బయటకు వెళ్లి వేప చెట్టుకు ఊరేసుకుని మృతి చెందారు. మృతుడు మహేష్ తల్లిదండ్రుల ఇబ్బందులు భరించలేక జంట ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.