ETV Bharat / snippets

జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ - విచారణ రేపటికి వాయిదా

High Court On Jogi Ramesh Bail Petition
High Court On Jogi Ramesh Bail Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 5:47 PM IST

High Court On Jogi Ramesh Bail Petition : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలన్న వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 2021లో చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ మూక దాడికి తెగబడ్డారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్‌ చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి వ్యవహారంలో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.