High Court Hearing on Vishal Gunni Bail Petition: ముంబయి సినీ నటి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని విశాల్ గున్నీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానని సస్పెన్షన్‌లో ఉన్న విశాల్ గున్నీ కోర్టుకు తెలిపారు.
ముంబయి సినీ నటి కేసు - విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 1కి వాయిదా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2024, 5:15 PM IST