ETV Bharat / snippets

కాంగ్రెస్​ వచ్చింది - రాష్ట్రంలో తాగునీటి కష్టాలను మళ్లీ తెచ్చింది : హరీశ్​రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 4:20 PM IST

Harish Rao Tweet
Harish Rao Tweet on Drinking Water Problems (ETV Bharat)

Harish Rao Tweet on Drinking Water Problems : రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, తాగు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా వట్​పల్లి మండలం మేడికుందా తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. తాగు నీరు రాకపోవడంతో కాలి నడకన వెళ్లి కుంట నుంచి బిందెలో నీళ్లు తెచ్చుకుంటున్నారని అన్నారు.

కలుషిత నీళ్లు తాగటం వల్ల విష జ్వరాలు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారని హరీశ్​ రావు తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని అధికారులను వేడుకున్నా, స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకొని మేడికుందా తండాకు తాగునీరు పునరుద్ధరించాలని సంగారెడ్డి కలెక్టర్​ను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.