Godavari Water level Rises In Bhadrachalam : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 26 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 30 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల శ్రీరామ్ సాగర్, కాలేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో వరద నీరు స్నాన ఘట్టాల మెట్ల వరకు చేరి ప్రవహిస్తోంది. ఈరోజు సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 40 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం - 30 అడుగులు దాటి ప్రవాహం
Published : Sep 3, 2024, 11:40 AM IST