ETV Bharat / snippets

'ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఉచితంగా వైద్య పరీక్షలు'

FREE MEDICAL TEST IN RTC EMPLOYEES
Free Medical Test for TGS RTC Employees (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 3:16 PM IST

Free Medical Test for TGS RTC Employees : గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్​లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్​ను రూపొందించేలా సంస్థ ప్లాన్‌ చేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్​లో బాగ్​లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్​లో మంగళవారం రాష్ట్రస్థాయి హెల్త్ వాలంటీర్ల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్‌ ప్రొఫైల్స్‌ను సిద్దం చేసినట్లు సజ్జనార్ తెలిపారు. మొదటి ఛాలెంజ్​లో అద్దె బస్సు డ్రైవర్లతో సహా 47 వేల సంస్థ సిబ్బందికి, రెండో ఛాలెంజ్​లో 45 వేల ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.