ETV Bharat / snippets

ఉద్యోగాల పేరిట రూ.10 కోట్లు వసూలు- నాలుగేళ్లుగా ఇబ్బంది పడుతున్న బాధితులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 21 hours ago

fraud_in_the_name_of_government_jobs_in_guntur
fraud_in_the_name_of_government_jobs_in_guntur (ETV Bharat)

Fraud in The Name of Government Jobs in Guntur : గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో శ్రీనివాసరావు అనే వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన శ్రీనివాసరావు రైల్వేశాఖ, కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బులు వసూలు చేశాడు. సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. మోసపోయినట్లు గ్రహించి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అటు ఉద్యోగాలు రాక ఇటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో నాలుగేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నామంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ. 9నుంచి రూ.10లక్షల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు చెప్పారు. కొందరు పొలాలు అమ్మి, మరికొందరు ఇళ్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి డబ్బులు కట్టారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తమను శ్రీనివాసరావు బెదిరించినట్లు బాధితులు వాపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.