ETV Bharat / snippets

ప్రభుత్వ పట్టింపులేనితనం విద్యార్థులకు శాపం - పాలమాకుల గురుకుల పాఠశాల నిరసనపై హరీశ్​రావు ట్వీట్

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 6:48 PM IST

HARISH ON GOVT SCHOOL FACILITIES
Harish Rao on Govt School Issues (ETV Bharat)

Harish Rao on Govt School Issues : ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవటం వల్లే గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, సరైన సౌకర్యాలు అందటం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేడు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా ఆయన ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు.

పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతుందని హరీశ్​రావు మండిపడ్డారు. నడిరోడ్డెక్కి నినాదిస్తున్న వారి ఆవేదనను మానవత్వంతో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.