Flood Flow Will Gradually Increase in Srisailam Project : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 2,18,406 క్యూసెక్కుల వరద వస్తోంది. అలాగే ఎడమగట్టు నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 854.90 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90.55 టీఎంసీల నీరు ఉంది.
శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద - ప్రస్తుత నీటిమట్టం ఎంతంటే?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 5:59 PM IST