First Wife Son And Daughter Attacks On Father :ఆస్తి పంపకాల విషయంలో హత్య జరిగిన ఘటన వేములవాడలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన మామిండ్ల మల్లయ్య మొదటి భార్య మృతి చెందడంతో 15 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు.. రెండో భార్యకు కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి భార్య కుమార్తెలు, కొడుకు వివాహం కాగా రెండో భార్య సంతానం చిన్న పిల్లలు.
ఆస్తి పంపకాల విషయంలో మల్లయ్యకు మొదటి భార్య సంతానానికి తరచూ గొడవలు జరిగేవి. ఈ విషయమై కుల సంఘంలో ఆదివారం పంచాయతీ కాగా అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన మొదటి భార్య సంతానం మల్లయ్య, అతని రెండో భార్యపై కత్తితో దాడి చేయగా తీవ్రరక్తస్రావం అయింది. ఈ ఘటనలో మల్లయ్య పరిస్థితి విషమించి మృతి చెందగా, అతడి రెండో భార్యను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు.