Farmers Face Problems For Fertilizers : ఓ వైపు భారీ ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు రైతులు ఎరువుల కోసం సొసైటీల ముందు పడి కాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ సొసైటీ వద్ద రైతులు విత్తనాల కోసం వేకువజామున 5 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు ఎండను సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్నారు. కొందరు రైతులు ఎండలకు తట్టుకోలేక వరుసలో కాగితాలు, రాళ్లను ఉంచుతున్నారు. గంటల తరబడి క్యూలో ఉండి వెళ్తే ఒక పాస్ పుస్తకానికి ఒక బస్తా చొప్పున విత్తనాలు ఇవ్వడంతో అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని రైతులకు సరిపడా జీలుగ బస్తాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు.
కామారెడ్డిలో విత్తనాల కొరత - ఎర్రటి ఎండలో రైతుల క్యూ
Published : May 25, 2024, 12:07 PM IST