ETV Bharat / snippets

రైలు చక్రంలో సాంకేతిక లోపం - 2 గంటలు ఆలస్యంగా ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 10:45 AM IST

Updated : Jul 6, 2024, 12:38 PM IST

Falaknuma Super Fast Express
Falaknuma Super Fast Express (ETV Bharat)

Falaknuma Express stopped at Miryalaguda Railway Station : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్​లో సాంకేతిక కారణాలతో సింహపురి ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. హౌరా నుంచి సికింద్రాబాద్​ వెళుతున్న ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ వెనుక భాగంలో వీల్​ ఒకచోట రెండు ఇంచుల మందం అరిగిపోవడం లేదా సొట్ట పోవడం వల్ల హిల్​ బ్రేక్​ లాక్​ కావడంతో ప్రయాణించేటప్పుడు విపరీతంగా శబ్దం రావడాన్ని రైల్వే అధికారులు గుర్తించారు. వెంటనే ట్రైన్​ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్​లో అక్కడికక్కడే నిలిపివేశారు.

దీంతో ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే రైళ్లకు అంతరాయం కలిగింది. సుమారు రెండు గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎట్టకేలకు రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది శ్రమించి త్వరితగతిన మరమ్మతులు చేయడంతో రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ 2 గంటల ఆలస్యంగా సికింద్రాబాద్​ బయలుదేరింది.

Last Updated : Jul 6, 2024, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.