ETV Bharat / snippets

ఏడుపాయల అమ్మవారి ఆలయం - నాలుగో రోజూ జల దిగ్భందంలోనే

EDUPAYALA TEMPLE IN MEDAK
EDUPAYALA VANADURGAMATHA TEMPLE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 1:47 PM IST

Edupayala Durgadevi Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రం నాలుగో రోజూ జలదిగ్బంధంలోనే ఉంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ఆలయం ముందున్న మంజీరా నది పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆలయం వద్ద వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గర్భగుడిని మూసివేసి భక్తుల కోసం రాజగోపురంలో వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి అభిషేకం, సహస్రనామార్చన ,కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. వరదఉధృతి తగ్గగానే భక్తులకు యధావిధిగా మూలవిరాట్టు దర్శనం కల్పిస్తామని ఆలయం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వనదుర్గ ఆనకట్టవైపు గర్భగుడి వైపు భక్తులు ఎవరు వెళ్లకుండా పోలీసులు బారీకెడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.