ETV Bharat / snippets

నేడు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 7:45 AM IST

Telangana Assembly Budget Session
TG Assembly Session (ETV Bharat)

TG Assembly Session : తెలంగాణ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈవేళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇవాళ మొత్తం 19 పద్దులపై శాసనసభలో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఈ పద్దులను సభలో ప్రవేశపెడతారు.

పద్దుల్లో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్​మెంట్​, పరిశ్రమల, ఐటీ, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్యా, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్ అండ్ హెల్త్ తదితర 19 పద్దులపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఈ పద్దులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో ప్రవేశపెట్టనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.