ETV Bharat / snippets

భవానీ అలంకరణలో భద్రకాళీ అమ్మవారు - దర్శనానికి బారులుతీరిన భక్తులు

SHARANNAVARATHIRI CELEBRATIONS
BHADRAKALI TEMPLE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 11:55 AM IST

Bhadrakali Temple in Warangal: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భవానీ అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దర్శనానికి భక్తులు ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్​లలో బారులు తీరారు.

అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భవాని అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వృద్ధులకు, చిన్నారులకు, గర్భిణీలకు ప్రత్యేక క్యూ లైన్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో సరైన తాగునీటి వ్యవస్థ లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.