ETV Bharat / snippets

'ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు, జీతాలు ఇవ్వడం లేదు' - పవన్​ను కలసిన బాధితులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Pawan_Kalyan
Deputy CM Pawan Kalyan (ETV Bharat)

Deputy CM Pawan Kalyan Meet RWS Employees: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గ్రామీణ నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిని కలిశారు.

రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.