ETV Bharat / snippets

పంజాబ్​ లోక్​సభ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి - గత వారం రోజులుగా అక్కడే మకాం

author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 9:34 PM IST

Deputy CM Bhatti Vikramarka Election Campaign in Punjab
Deputy CM Bhatti Vikramarka Election Campaign in Punjab (ETV Bharat)

Deputy CM Bhatti Vikramarka Election Campaign in Punjab : దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రతి ఇంటి పెద్దకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మహిళలను మహారాణులుగా చేస్తామని చెప్పారు. మంగళవారం పంజాబ్​ రాష్ట్రంలోని ఫరీద్​ కోట్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఫరీద్ కోట్ లోక్​సభ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు కోటక్ పుర ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.