Congress MP Mallu Ravi On KTR : అమృత్ పథకం టెండర్ల విషయంలో మాజీమంత్రి కేటీఆర్ అడ్డగోలు అబద్ధాలు ఆడుతూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సతీమణికి సొంత తమ్ముడు కాదని, బాబాయ్ కుమారుడు అవుతాడని ఈ విషయంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆన్లైన్లో టెండర్లు వేసిన అమృత్ పథకంలో ఆయన తన కంపెనీని జాయింట్ వెంచర్లో కాంట్రాక్టు పొందారని మల్లు రవి చెప్పారు. అక్కడ అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజల్లో రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ పూట గడుపుతున్నారని విమర్శించారు.