ETV Bharat / snippets

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 7:32 PM IST

CM REVANTH REDDY
CM Revanth Reddy's key meeting with District Collectors and SPs on Tuesday (ETV Bharat)

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్థులో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఎం సమావేశం ఉంటుందని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ శాంతికుమారి సమాచారం ఇచ్చారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పాలన వ్యవస్థ మరింత పటిష్టం కావాలని చెప్పారు. తాను వారానికో జిల్లా పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్టు తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి, త్వరలో ఇతర జిల్లాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు కూడా కొలిక్కి రావడంతో రేపు వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేయాలని సీఎం నిర్ణయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.