ETV Bharat / snippets

హైదరాబాద్‌ చేరుకున్న నూతన గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ - స్వాగతం పలికిన సీఎం రేవంత్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 3:35 PM IST

Telangana Governor Jishnu Dev Verma
CM Revanth Welcomed Governor Jishnu Dev Varma (ETV Bharat)

CM Revanth Welcomed Jishnu Dev Varma at Airport : తెలంగాణ నూతన గవర్నర్​గా జిష్ణు దేవ్ వర్మ నేడు ప్రమాణం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, కొత్త గవర్నర్​తో ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు త్రిపుర రాజధాని అగర్తల నుంచి జిష్ణు దేవ్‌వర్మ, కుటుంబ సభ్యులతో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ చేరుకున్న నూతన గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మకు సీఎం రేవంత్​రెడ్డి స్వాగతం పలికారు. ఆయన వెంట సీఎస్​ శాంతికుమారి, డీజీపీ జితేందర్​ ఉన్నారు. అనంతరం విమానాశ్రయంలో సాయుధదళాల నుంచి జిష్ణు దేవ్‌ వర్మ గౌరవవందనం స్వీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.