ETV Bharat / snippets

సీఎం రేవంత్​ రెడ్డి పెద్ద మనసు​ - క్యాన్సర్​ బాధితుడి చికిత్సకు ఆదేశం

CM Revanth Reddy On Cancer Boy Treatment
CM Revanth On Cancer Boy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 8:58 PM IST

CM Revanth On Cancer Boy : వరంగల్ క్యాన్సర్‌ బాధిత బాలుడు మహ్మద్‌ అదిల్‌ అహ్మద్‌ చికిత్సకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. వరంగల్‌లో తనను కలవలేకపోయిన ఆ బాలుడి విషయమై స్పందించిన సీఎం రేవంత్, అహ్మద్‌కు వైద్య తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు.

సీఎం సూచనలతో బాలుడి కుటుంబసభ్యులతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ ఫోన్‌లో మాట్లాడారు. నెలరోజుల కిందట అదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి లక్ష రూపాయల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోసీ మంజూరు చేసింది. ప్రస్తుతం అదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వేముల శ్రీనివాస్ సీఎంఆర్ఎఫ్ కింద అవసరమైన సాయం అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.