CM Revanth Reddy Delhi Tour : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ చేరుకున్నారు. గురువారం ఆయన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర ముఖ్యులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం అందించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
వర్షాల కారణంగా జరిగిన నష్టంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలోనున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవులకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లుగా సమాచారం.