CM Chandrababu on Swarnandhra Pradesh 2047 : స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తూ "swarnandra.ap.gov.in" వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ సైట్ ద్వారా తమ అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వంతో పంచుకున్నవారికి "ఈ-సర్టిఫికెట్" జారీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 43 వేల డాలర్ల తలసరి ఆదాయంతో, 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది 2047 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని సీఎం వెల్లడించారు. అందుకు అనుగుణంగా "స్వర్ణాంధ్రప్రదేశ్@2047 (Swarnandhra Pradesh@2047)" దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఉజ్వల ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా పౌరులందరి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రతి అభిప్రాయం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరి సూచనను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అందరం కలసికట్టుగా స్వర్ణాంధ్ర నిర్మాణానికి కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నా : చంద్రబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2024, 1:00 PM IST