MGNREGA Pending Funds Released: రాష్ట్రానికి రావాల్సిన 2 వేల 812 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులను కేంద్రం మంజూరు చేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో మదర్ శాంక్షన్ కింద ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల కోసం 21.5 కోట్ల పనిదినాలకు రూ.5,743.90 కోట్లు మంజూరు చేసింది. గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించిన వేతన నిధులు రూ.2934.80 కోట్లు విడుదల అయ్యాయి. వీటికి అదనంగా ఇప్పుడు రూ.2,812.98 కోట్లు నిధులు మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలో 2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టి.ఓ.ల అప్లోడ్ ఆధారంగా ఖాతాలకు జమ అయ్యాయి.
ఉపాధి హామీ పెండింగ్ నిధులు విడుదల చేసిన కేంద్రం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 5:54 PM IST
|Updated : Aug 9, 2024, 6:14 PM IST