ETV Bharat / snippets

కేంద్రం కీలక నిర్ణయం - 730 రేడియో స్టేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 12:15 PM IST

RADIO STATIONS ESTABLISHMENT
RADIO STATIONS IN TELANGANA (ETV Bharat)

Central Govt Radio Stations News : దేశంలో 234 నగరాల్లో 730 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణ నుంచి 31 స్టేషన్లకు అవకాశం దక్కింది. ఉపాధి కల్పన దిశగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ మూడోదశ ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడింది.

తెలంగాణ నుంచి అవకాశం దక్కిన 31 స్టేషన్​లలో ఆదిలాబాద్, కొత్తగూడెం వంటి వెనుకబడిన జిల్లాలతో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్గొండ, రామగుండం, సూర్యాపేట జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. నిజామాబాద్‌కు 4 ఛానల్స్‌ను కేటాయించారు. వీటిల్లో వెనుకబడిన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. వీటి ఏర్పాటు వల్ల ప్రాంతీయ భాషలను ఆయా ప్రాంత ప్రజలకు అందించేందుకు వీలుంటుంది. దీంతో పాటు ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయి వరకూ చేర్చేందుకు వీలవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.