Cabinet Meeting will be held Tomorrow : రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది.
రాష్ట్రంలోని దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ నిర్వహణ, ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన 6నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది.