ETV Bharat / state

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు - తొలి ఫేజ్​లో 42స్టేషన్లు! - VISHAKA METRO TRAIN PROJECT

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభంపై స్పష్టత - శాసన మండలిలో వివరించిన మంత్రి నారాయణ

Minister Narayana on Vishaka Metro Project
Minister Narayana on Vishaka Metro Project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 6:50 PM IST

Minister Narayana on Vishaka Metro Project : ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. అతి త్వరలో మెట్రో పనులు ప్రారంభిస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్​పై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక కేంద్రానికి పంపించామని, కేంద్రం నుంచి అనుమ‌తులు రాగానే ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభిస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వంద‌శాతం నిధులు కేంద్ర‌మే భ‌రించేలా నిర్మాణం చేప‌ట్టాల‌ని కోరినట్లు శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. మొదటి ఫేజ్​లో 46.2 కి మీల‌తో మూడు కారిడార్లు నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి ఫేజ్​లో స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారని, ఈ కారిడార్స్​లో హనుమంతు వాక, మద్దెలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం ప్రాంతాలలో 14 జంక్షన్లు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతాలలో 8 మీటర్ల ఫ్లై ఓవర్, దానిపైన మెట్రో నిర్మాణం చేయ‌మ‌ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు డీపీఆర్ చేయాల‌ని నిర్ణ‌యించామని తెలిపారు.

కేంద్ర అనుమతులు రాగానే విశాఖలో మెట్రో పనులు: మంత్రి నారాయణ

Vizag Metro Project Issue in Assembly : కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విశాఖలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని నారాయణ వెల్లడించారు. నవంబర్ 14న అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ప్రాంత ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్‌ నాయుడు, వెలగపూడి రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 76.90 కి.మీ. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై పంపిన డీపీఆర్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.

వంద శాతం నిధులూ కేంద్రం భరించేలా ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. తొలి దశలో 3 కారిడార్లలో 42 స్టేషన్లతో 46.23 కి.మీ. మేర నిర్మించే ప్రాజెక్టుకు రూ.11,498 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఒకటో కారిడార్‌లో స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది కూడలి వరకు(34.4 కి.మీ.), రెండోది గురుద్వారా-ఓల్డ్‌ పోస్టాఫీస్‌ వరకు (5.07 కి.మీ.), మూడో కారిడార్‌లో తాటిచెట్లపాలెం -చినవాల్తేరు వరకు(6.75 కి.మీ) పనులు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.

త్వరలోనే విజయవాడకు మెట్రో రైలు - కేంద్రానికి ప్రతిపాదనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.